కంగారు పుడుతుంటే, దడ వస్తుంటే,
పాదం కింద భూమి క్రుంగినట్టుంది.
క్రుంగి క్రుంగి అంతా గోయ్యే అయితే,
తిరిగి రానేమోనని భయంగా ఉంది.
చక్కగా నవ్వు, చిలకలా నవ్వు,
అని చెప్పి చెప్పి నన్ను మార్చారు మీరు.
బొట్టు రాల్చినా చాలు,
చెడంతా మనదే అని మరీ మరీ నన్ను మభ్య పెట్టారు.
బెంగగా ఉన్నా, భయంగా ఉన్నా,
ధైర్యం చూపించడం గాంభీర్యమన్నారు.
నిస్సహాయతలోనూ నవ్విచూపించు,
అదే మరి గొప్పతనం అన్నారు.
ఒక్క మాట కూడా జవదాటేదిలేదు,
మెచ్హుకుంటే దాన్ని మించేదిలేదు.
ఇష్టమల్లా వ్యవహారమయ్యింది,
గొంతులోని బాధ మింగేయమంది.
బెంగగా ఉంటే నవ్వాను నేను,
భయం వేస్తే మరింత బిగ్గరగానూ.
ధైర్యం నూరి నాకే ఇవ్వలనుంది,
కానీ ఒక్కదాన్నే ఉన్నట్టు బేలగా ఉంది.
ఒక్క గుక్కలో నాకు ఏడుపొస్తుంది,
మరో మనిషుంటే తప్పదు నవ్వాల్సోస్తుంది.
దాగి దాగి నాలో ఓర్పు పోయింది,
ఊర్పుగా ఎవరైనా దగ్గరకు వచ్చి,
వెలితి అంతా నీకు పోయేవరకు-
ఏదేమైనా నేను ఇక్కడే ఉంటా,
ఎన్నాళ్ళైనా నీకు తోడుగా ఉంటా.
నీనుంచి నాకసలు ఆశలే లేవు,
కోపాలు, తాపాలు అస్సలే లేవు.
ఇష్టమై స్వయంగా పక్కనే ఉంటా,
కోరికే లేకుండా నీడ నిలిచుంటా.
అని చెప్తూ ఉంటే నాకు వినాలనుంది,
నమ్మకంగా సొంతమనాలని ఉంది.
దీర్ఘంగా కనుమూసి నిద్రపోతూనే,
మనసు నిండేలా నాకు నవ్వాలనుంది
పాదం కింద భూమి క్రుంగినట్టుంది.
క్రుంగి క్రుంగి అంతా గోయ్యే అయితే,
తిరిగి రానేమోనని భయంగా ఉంది.
చక్కగా నవ్వు, చిలకలా నవ్వు,
అని చెప్పి చెప్పి నన్ను మార్చారు మీరు.
బొట్టు రాల్చినా చాలు,
చెడంతా మనదే అని మరీ మరీ నన్ను మభ్య పెట్టారు.
బెంగగా ఉన్నా, భయంగా ఉన్నా,
ధైర్యం చూపించడం గాంభీర్యమన్నారు.
నిస్సహాయతలోనూ నవ్విచూపించు,
అదే మరి గొప్పతనం అన్నారు.
ఒక్క మాట కూడా జవదాటేదిలేదు,
మెచ్హుకుంటే దాన్ని మించేదిలేదు.
ఇష్టమల్లా వ్యవహారమయ్యింది,
గొంతులోని బాధ మింగేయమంది.
బెంగగా ఉంటే నవ్వాను నేను,
భయం వేస్తే మరింత బిగ్గరగానూ.
ధైర్యం నూరి నాకే ఇవ్వలనుంది,
కానీ ఒక్కదాన్నే ఉన్నట్టు బేలగా ఉంది.
ఒక్క గుక్కలో నాకు ఏడుపొస్తుంది,
మరో మనిషుంటే తప్పదు నవ్వాల్సోస్తుంది.
దాగి దాగి నాలో ఓర్పు పోయింది,
దాకొనే ఉందామని తలపు పుడుతుంది.
వెలితి అంతా నీకు పోయేవరకు-
ఏదేమైనా నేను ఇక్కడే ఉంటా,
ఎన్నాళ్ళైనా నీకు తోడుగా ఉంటా.
నీనుంచి నాకసలు ఆశలే లేవు,
కోపాలు, తాపాలు అస్సలే లేవు.
ఇష్టమై స్వయంగా పక్కనే ఉంటా,
కోరికే లేకుండా నీడ నిలిచుంటా.
అని చెప్తూ ఉంటే నాకు వినాలనుంది,
నమ్మకంగా సొంతమనాలని ఉంది.
దీర్ఘంగా కనుమూసి నిద్రపోతూనే,
మనసు నిండేలా నాకు నవ్వాలనుంది
No comments:
Post a Comment